Ravi Kishan : పాలతో స్నానం.. గులాబీ పూల మీద నిద్ర.. దెబ్బకు సినిమా అవకాశాలు పోవడంతో..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ..

Ravi Kishan : పాలతో స్నానం.. గులాబీ పూల మీద నిద్ర.. దెబ్బకు సినిమా అవకాశాలు పోవడంతో..

Ravi Kishan

Updated On : July 6, 2025 / 1:30 PM IST

Ravi Kishan : సెలబ్రిటీలు తమ ఫిట్నెస్, అందం మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడతారు. ఫుడ్, డైలీ రొటీన్ లో చాలా కేర్ తీసుకుంటారు. అయితే నటుడు రవికిషన్ ఓ అడుగు ముందుకేసి మరీ ఓవర్ గా చేసాడట. రేసుగుర్రం సినిమాతో తెలుగులో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవికిషన్. భోజపురి లో హీరోగా, హిందీ, తెలుగు, మరాఠి సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగానే ఉన్నాడు రవికిషన్. మరో పక్క రాజకీయాల్లో ఎంపీగా సేవలు అందిస్తున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నేను రోజూ పాలతో స్నానం చేసేవాడ్ని. రాత్రిపూట గులాబీ పూల రేకుల మీద నిద్రించేవాడ్ని. నాకు హాలీవుడ్ హీరోలను చూపించి వాళ్ళు అలాగే ఉంటారు అని చెప్పేవాళ్ళు. హీరోలు, నటులు అలాగే ఉండాలేమో అని నేను కొన్నాళ్ళు అదే మెయింటైన్ చేశాను. నేను కూడా వీటి గురించి అందరూ మాట్లాడుకోవాలి అని అనుకున్నాను.

Also Read : Nidhhi Agerwal : పవన్ సినిమా అవ్వగానే ఈ హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తున్న త్రివిక్రమ్..? ఏ హీరో కోసమో తెలుసా?

కానీ దాని వల్ల నాకు వచ్చే అవకాశాలు పోయాయి. ఇవన్నీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కి తెలిసి గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ లో నాకు రోల్ ఇవ్వలేదు. అడిగితే నా డిమాండ్స్ ఇలా ఉంటాయని చెప్పారంట, వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేదని అందుకే ఛాన్స్ ఇవ్వలేదని చెప్పారు. అలా కొన్ని అవకాశాలు పోగొట్టుకున్నాను. దాంతో రియాలిటీలోకి వచ్చాను అని తెలిపారు.