Nidhhi Agerwal : పవన్ సినిమా అవ్వగానే ఈ హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తున్న త్రివిక్రమ్..? ఏ హీరో కోసమో తెలుసా?
హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు జులై 24న రిలీజ్ కాబోతుంది.

Nidhhi Agerwal
Nidhhi Agerwal : నిధి అగర్వాల్ చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అయితే పవన్ కళ్యాణ్ పక్కన హరిహర వీరమల్లు సినిమాకి ఒప్పుకోవడం, ఆ సినిమా ఐదేళ్లు సాగడం, ఆ సినిమా అయ్యేదాకా ఏ సినిమా చేయకుండా అగ్రిమెంట్ రాయడంతో నిధి చాలా సినిమాలను వదిలేసుకుంది.
హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు జులై 24న రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ప్రభాస్ రాజాసాబ్ సినిమా కూడా ఒప్పుకొని అందులో నటించింది. అయితే ఎంత కాదనుకున్నా హరిహర వీరమల్లు సినిమా వల్ల నిధి అగర్వాల్ కి పెద్ద నష్టమే జరిగింది. ఒకవేళ సినిమా హిట్ అయి, ఆమె పాత్రకు మంచి పేరు వస్తే ఇంకొన్ని అవకాశాలు రావొచ్చేమో. తాజాగా నిధి అగర్వాల్ ఓ కొత్త సినిమా ఛాన్స్ కొట్టేసిందని వినిపిస్తుంది.
Also Read : RK Sagar : నేడు డిప్యూటీ సీఎం పవన్.. రేపు సీఎం రేవంత్.. మొగలిరేకులు హీరో కోసం తరలి వస్తున్న నాయకులు..
అల్లు అర్జున్ పక్కకు తప్పుకోవడంతో త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా త్రిష అనుకోగా మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని అనుకున్నారట. నిధి అగర్వాల్ వెంకటేష్ తో కలిసి త్రివిక్రమ్ సినిమాలో నటించబోతుందని, త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడని టాలీవుడ్ లో వినిపిస్తుంది. అయితే అధికారికంగా అనౌన్స్ అయ్యేదాకా ఇది రూమర్ మాత్రమే.
ఇక త్రివిక్రమ్ – వెంకటేష్ సినిమాకు వెంకట రమణ అనే టైటిల్ అనుకుంటున్నారని, త్రిష – నిధి అగర్వాల్ హీరోయిన్స్ అని, రుక్మిణి వసంత్ పేరు కూడా పరిశీలనలో ఉందని, ఆగస్టు నుంచి ఈ సినిమా షూట్ మొదలవుతుందని సమాచారం.
Also Read : Naveen Chandra : ఎన్టీఆర్ తో సినిమా.. ఫస్ట్ నో చెప్పాడంట.. నవీన్ చంద్రను ఎవరు ఒప్పించారో తెలుసా?