RK Sagar : నేడు డిప్యూటీ సీఎం పవన్.. రేపు సీఎం రేవంత్.. మొగలిరేకులు హీరో కోసం తరలి వస్తున్న నాయకులు..
సాగర్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా ‘ది100’ జులై 11న రిలీజ్ కాబోతుంది.

RK Sagar
RK Sagar : మొగలిరేకులు సీరియల్ లో RK నాయుడు, మున్నా పాత్రలతో RK సాగర్ ఎంతటి స్టార్ డమ్ తెచ్చుకున్నాడో అందరికి తెలిసిందే. ఇప్పుడు సాగర్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. సాగర్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా ‘ది100’ జులై 11న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో సాగర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
నేడు ది100 సినిమా ట్రైలర్ ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. సాగర్ తెలంగాణ జనసేనలో కీలక పదవిలో ఉన్నాడు. అయితే ది100 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్ గా హాజరు కాబోతున్నారట.
Also Read : Naveen Chandra : ఎన్టీఆర్ తో సినిమా.. ఫస్ట్ నో చెప్పాడంట.. నవీన్ చంద్రను ఎవరు ఒప్పించారో తెలుసా?
రేపు జులై 6న ది100 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. ఈ ఈవెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు సమాచారం. దీంతో సాగర్ సినిమా కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రావడంతో ఆశ్చర్యపోతున్నారు అంతా..