Naveen Chandra : ఎన్టీఆర్ తో సినిమా.. ఫస్ట్ నో చెప్పాడంట.. నవీన్ చంద్రను ఎవరు ఒప్పించారో తెలుసా?

అరవింద సమేత సినిమాలో నవీన్ చంద్ర బాలిరెడ్డి పాత్రలో ఎన్టీఆర్ కి ధీటుగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

Naveen Chandra : ఎన్టీఆర్ తో సినిమా.. ఫస్ట్ నో చెప్పాడంట.. నవీన్ చంద్రను ఎవరు ఒప్పించారో తెలుసా?

Naveen Chandra

Updated On : July 5, 2025 / 9:24 PM IST

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత పలు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాలేదు. కానీ ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే నవీన్ చంద్ర మొదట అరవింద సమేత సినిమా చేయను అన్నాడట.

తాజాగా ఆహా కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా వచ్చిన నవీన్ చంద్ర తన కెరీర్ గురించి చెప్తూ ఈ విషయాన్ని తెలిపాడు.

Also Read : Pawan Kalyan – Sagar : పవర్ స్టార్ తో మొగలి రేకులు ఫేమ్ సాగర్.. స్పెషల్ మీట్.. ఎందుకో తెలుసా?

నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ఫస్ట్ నేను తేజ జై సినిమా ఆడిషన్ కి వచ్చాను. పేపర్లో యాడ్ చూసి వచ్చా. ఆ సినిమా ఛాన్స్ రాలేదు. ఆ సినిమాకు పనిచేసిన రవివర్మ సంభవామి యుగేయుగే లో ఛాన్స్ ఇచ్చారు. నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత అందాల రాక్షసి తో స్టార్ అయిపోయా కానీ తర్వాత వెంటనే కిందకి పడిపోయా ఏ సినిమా పడితే అది చేసి. దాంతో వర్క్ లేని సమయంలో రాజా రవీంద్రని మేనేజర్ ఉండమని, వర్క్ ఇప్పించమని అడిగాను. ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ ఛాన్స్ రాజా రవీంద్రనే ఇప్పించారు. మొదట ఆ క్యారెక్టర్ చేయను అన్నాను. హీరోగానే చేస్తా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయను అన్నాను. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ పెద్ద సినిమా, ఆర్టిస్ట్ గా చేయాలి, ఈ సినిమాతో గుర్తింపు వస్తుంది అని చెప్పి ఒప్పించాడు. చెప్పినట్టే ఆ సినిమాతో నా లైఫ్ మారిపోయింది అని తెలిపాడు.

అరవింద సమేత సినిమాలో నవీన్ చంద్ర బాలిరెడ్డి పాత్రలో ఎన్టీఆర్ కి ధీటుగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

Also Read : Virgin Boys : బిగ్ బాస్ మిత్ర శర్మ ‘వర్జిన్ బాయ్స్’ ట్రైలర్ రిలీజ్.. సినిమా చూస్తే లక్కీ విన్నర్స్ కి ఐ ఫోన్స్ గిఫ్ట్..