Pawan Kalyan – Sagar : పవర్ స్టార్ తో మొగలి రేకులు ఫేమ్ సాగర్.. స్పెషల్ మీట్.. ఎందుకో తెలుసా?
పవన్ తో సాగర్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Pawan Kalyan
Pawan Kalyan – Sagar : మొగలిరేకులు సీరియల్ తో RK నాయుడు, మున్నా పాత్రలతో సాగర్ ఎంతటి స్టార్ డమ్ తెచ్చుకున్నాడో అందరికి తెలిసిందే. తర్వాత హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మరో పక్క తెలంగాణ జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సాగర్ త్వరలో ‘ది100’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో సాగర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
ఇప్పటికే ‘ది100’ టీజర్ రిలీజవ్వగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ‘ది100’ ట్రైలర్ ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. దీంతో సాగర్, ‘ది100’ మూవీ టీమ్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ క్రమంలో పవన్ తో సాగర్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా జులై 11 రిలీజ్ కానుంది.
Also Read : Allu Arjun : అమెరికాలో అడుగు పెట్టిన అల్లు అర్జున్.. లుక్ అదిరిందిగా.. ఫొటోలు వైరల్..
మీరు కూడా ‘ది100’ ట్రైలర్ చూసేయండి..