Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజమౌళి సినిమా లేనట్టేనా??

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయన చెప్పింది కూడా కరక్టే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాజమౌళి సినిమా

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజమౌళి సినిమా లేనట్టేనా??

Rajamouli Pk

Updated On : October 31, 2021 / 1:32 PM IST

Pawan Kalyan :  దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగాడు. ఇకపై తాను చేసే సినిమాలు కూడా అదే లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ కి సినిమాలు, హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ పెరుగుతూనే ఉంటుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని ఎప్పట్నుంచో అభిమానులు, ప్రేక్షకులు, సినీ పరిశ్రమ కూడా కోరుకుంటుంది. చాలా సార్లు వీళ్ళ సినిమా గురించి చర్చ జరిగింది. తాజాగా రాజమౌళి ఓ ఫంక్షన్ లో ఇచ్చిన స్పీచ్ తో ఇక వీళ్లిద్దరి మధ్య సినిమా లేనట్టే అని తెలుస్తుంది.

Bigg Boss 5 : కంటెస్టెంట్స్ పై సీరియస్ అయిన నాగార్జున.. హౌస్ లో ఎవరు ఎవర్ని కాటేస్తున్నారు?

తాజాగా శ్రీకాకుళంలో జరిగిన ఓ కాలేజ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి అక్కడి స్టూడెంట్స్ తో మాట్లాడారు. స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. అందులో భాగంగానే ఓ స్టూడెంట్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగాడు. దీనికి రాజమౌళి ఆసక్తికరంగా సమాధానం తెలిపాడు.

AHA : ఆహా అవార్డ్స్.. మొట్టమొదటి ఓటిటి అవార్డ్స్.. మీరే ఎన్నుకోండి

రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని చాలా సంవత్సరాలు వెయిట్ చేశానని, కానీ అది కుదరలేదు అని అన్నారు. ఓ మూవీ షూటింగ్ లో పవన్‌ని కలిశాను. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది అని అడిగా. మీరు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి. ఎలాంటి సినిమా చేయడానికైనా నేను రెడీ అన్నారు. సరే సార్ అయితే మీరు టైమివ్వండి. ఏ టైమ్‌లో రమ్మంటే ఆ టైమ్‌లో వచ్చి మీకు కథ చెబుతా అన్నాను. ఆ తర్వాత ఆయన కథ వినడానికి పిలుస్తారు అనుకున్నాను కాని అయన దగ్గరి నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తర్వాత ఆయన వేరే సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఈ లోపు నా థింకింగ్ మారిపోయింది. జస్ట్ మాస్ సినిమాలు కాదు, మోర్ బిగ్గర్, వైడర్ రీచ్ ఉన్న సినిమాలు చేయాలని అనుకున్నా. అలా ‘మగధీర’, ‘యమదొంగ’, ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేస్తూ వచ్చా. ఈ లోపు ఆయనకేమో సినిమాలకంటే రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు నాతో సినిమా అంటే షూటింగ్ కి చాలా టైం పడుతుంది. అంత టైం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇవ్వలేరు. ప్రస్తుతం మేమిద్దరం వేరు వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నాము. కలుస్తామో లేదో తెలీదు. భవిష్యత్తులో సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అన్నారు. కాని ఆయనతో నేను సినిమా చేసిన చేయకపోయినా పవన్ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కూడా అని అన్నారు.

RGV : దిశా ఎన్కౌంటర్ పై ఆర్జీవీ సినిమా ట్రైలర్ విడుదల

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయన చెప్పింది కూడా కరక్టే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాజమౌళి సినిమా ఉండకపోవచ్చు అనే అనిపిస్తుంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము.