Tholi Prema : తొలిప్రేమ సినిమాకి పవన్ రెమ్యునరేషన్.. ప్రతి నెల ఖర్చులకు కొంత అడిగాడంట..

తొలిప్రేమ రీ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా చిత్రయూనిట్ అంతా విచ్చేశారు. ఈ సినిమా SSC ఆర్ట్స్ బ్యానర్ పై GVG రాజు నిర్మించారు. తొలిప్రేమ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో GVG రాజు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు.

Tholi Prema : తొలిప్రేమ సినిమాకి పవన్ రెమ్యునరేషన్.. ప్రతి నెల ఖర్చులకు కొంత అడిగాడంట..

Pawan Kalyan Remuneration for Tholi prema Movie revealed by Producer GVG Raju

Updated On : June 25, 2023 / 10:17 AM IST

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తొలిప్రేమ. 1998లో రిలీజయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. సింపుల్ లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్, మంచి సాంగ్స్, కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులని మెప్పించింది. అనేక అవార్డులని, జాతీయ అవార్డుని కూడా తొలిప్రేమ సినిమా సాధించింది. ఇక ఈ సినిమా రిలీజయి 25 ఏళ్ళు అయిన సందర్భంగా తొలిప్రేమను జూన్ 30న గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు.

తొలిప్రేమ రీ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా చిత్రయూనిట్ అంతా విచ్చేశారు. ఈ సినిమా SSC ఆర్ట్స్ బ్యానర్ పై GVG రాజు నిర్మించారు. తొలిప్రేమ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో GVG రాజు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు. పవన కళ్యాణ్ ప్రస్తుతం సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నట్టు అందరికి తెలిసిందే. ఆయనే స్వయంగా గతంలో తెలిపారు. అయితే తొలిప్రేమ సమయంలో ఎంత తీసుకున్నారు అనే దానిగురించి GVG రాజు మాట్లాడారు.

Udhayanidhi Stalin : ఇదే నా చివరి సినిమా అంటూ హీరో ప్రకటన.. నోటీసులు పంపిన నిర్మాత..

GVG రాజు మాట్లాడుతూ.. తొలిప్రేమ సినిమాకి పవన్ కళ్యాణ్ కి లక్షల్లోనే రెమ్యునరేషన్ ఇచ్చాము. ఎన్ని లక్షలు ఇచ్చాము అనేది నేను చెప్పను. సినిమా ఓకే అయ్యాక రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ నేను ఇంత ఇవ్వగలను, మీకు ఎలా కావలి? మొత్తం ఒకేసారి, లేదా కొంచెం కొంచెం ఇవ్వాలా అని అడిగాను పవన్ గారిని, ఆయన మీ ఇష్టం అన్నారు. అయితే ముందు అడ్వాన్స్ గా కొంచెం ఇస్తాను. మిగిలినదంతా ఒకేసారి సినిమా రిలిజ్ తర్వాత ఇస్తాను అని చెప్తే ఏమి మాట్లాడకుండా ఓకే అన్నారు. కాకపోతే సినిమా అయ్యేవరకు నెలనెల ఖర్చులకు కొంత అమౌంట్ మాత్రం ఇవ్వండి అని అడిగాడు, ఓకే చెప్పాను. చెప్పినట్టే సినిమా రిలీజయినా రెండు రోజులకి మొత్తం రెమ్యునరేషన్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో పెట్టాను అని తెలిపారు. దీంతో తొలిప్రేమ నిర్మాత GVG రాజు పవన్ రెమ్యునరేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.