Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఇండస్ట్రీలోకి వస్తుందా..? తన కెరీర్ ప్లాన్ ఏంటి..?

పవన్ అభిమానులందురూ అకీరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆద్య ఏం చేస్తుంది..? సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఇండస్ట్రీలోకి వస్తుందా..? తన కెరీర్ ప్లాన్ ఏంటి..?

Pawan Kalyan Renu Desai daughter Aadya is comming to cinemas

Updated On : October 19, 2023 / 11:55 AM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ లకు అకీరా నందన్, ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. పవన్ అభిమానులందురూ అకీరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అకీరాకి మాత్రం ప్రస్తుతం నటన ఇంటరెస్ట్ లేదని, తను మ్యూజిక్ అండ్ సినిమా ప్రొడక్షన్ పై మాత్రమే ఆసక్తి చూపిస్తున్నాడంటూ రేణూ దేశాయ్ గత కొంత కాలంగా చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఆద్య ఏం చేస్తుంది..? సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా..? అనే సందేహం కొందరిలో ఉంది.

Also read : Renu Desai : హైదరాబాద్, పూణేలో రేణుదేశాయ్‌కి ఆస్తులు.. ఆమెకు సంపాదన ఎలా వస్తుంది..?

ఇక ఇదే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ని అడగగా ఆమె జవాబు ఇచ్చింది. ఆద్యకి ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక అంట. చిన్నప్పుడు నుంచి అదే ఆలోచనతో ఉంది. త్వరలో కాలేజీలో కూడా జాయిన్ కాబోతున్నట్లు రేణూదేశాయ్ చెప్పుకొచ్చింది. రేణూ దేశాయ్ ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వస్తుంది. ఆమె తాతలు నుంచి ఆ వృత్తి చేస్తూనే వస్తున్నారట. వారిని చూస్తూ పెరగడం వలనే ఆద్యకి కూడా నిర్మాణ రంగంపై మక్కువ కలిగి ఉండొచ్చని తెలుస్తుంది.

Also read : Renu Desai : పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమా హీరోయిన్ నాకు నచ్చలేదు..

అకీరా నందన్ విషయానికి వస్తే.. ఇటీవలే యూఎస్ లోని ఫిలిం స్కూల్ జాయిన్ అయ్యాడు. అక్కడ మ్యూజిక్, మూవీ ప్రొడక్షన్ పై కోర్స్ నేర్చుకోబోతున్నాడని రేణూదేశాయ్ తెలియజేసింది. పవన్ అభిమానులంతా అకీరాని హీరోగా చూడాలని అనుకుంటున్నారు. మరి అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? లేదా మ్యూజిక్, ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తాడా అనేది చూడాలి. ఇక రేణూదేశాయ్ విషయానికి వస్తే.. జానీ తరువాత మళ్ళీ స్క్రీన్ పై కనిపించలేదు. ఇప్పుడు రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ షురూ చేసింది.