Akira Nandan
Akira Nandan : పవన్ కళ్యాణ్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో పవన్ తనయుడు అకిరాకు కూడా ఆల్మోస్ట్ అంతే ఫాలోయింగ్ ఉంది. అకిరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ పెద్ద కూతురు ఆద్య అందరికి సుపరిచితమే. చిన్న కూతురు పలీనా అంజని మాత్రం ఇటీవలే సంవత్సరం క్రితం తిరుమలలో పవన్ తో కనిపించి వైరల్ అయింది.(Akira Nandan)
అయితే తాజాగా పవన్ తనయుడు అకిరా నందన్ తన ఇద్దరు చెల్లెల్లు ఆద్య, పలీనా అంజని లతో కలిసి దిగిన ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో పవన్ కూతుళ్లు ఇద్దరూ ట్రెడిషినల్ గా రెడీ అయ్యారు. దీంతో వీళ్ళు ఎప్పుడు ఎక్కడ కలిశారు అని సందేహిస్తున్నారు. అయితే ఈ ఫొటో జాగ్రత్తగా చూస్తే ఇది AI ఫొటో అని తెలిసిపోతుంది. ఇది నిజమైన ఫోటోనా, AI ఫోటోనా అని వెతుకుతున్నారు నెటిజన్లు.
Also Read : Raja saab: రాజాసాబ్ మూవీని ఫస్ట్ డేనే, ఉచితంగా చూడాలనుకుంటున్నారా? మెసేజ్ పెట్టు, టికెట్ పట్టు..
ఈ ఫొటో చూస్తే ఇది క్లియర్ గా AI ఫొటో అని తెలిసిపోతుంది. గతంలో పవన్ కళ్యాణ్ తిరుమలలో తన కూతుళ్లు ఇద్దరితో కలిసి దిగిన ఫోటోని రిఫరెన్స్ గా తీసుకొని ఇలా అకిరా నందన్ ఇద్దరు చెల్లెళ్ళతో దిగినట్టు AI లో మార్చేశారు.
ఇక అకిరా ఫేస్ కట్ కూడా కూడా దగ్గర్నుంచి చూస్తే కాస్త తేడాగానే ఉంది. కొంతమంది అయితే అసలు ఇది అకిరానేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇది AI ఫోటోగా తేల్చేసారు ఫ్యాన్స్. చేస్తే చేసారు గాని అకిరా తన చెల్లెళ్ళతో కలిసి ఉండటం ముచ్చటగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also See : ‘రాజాసాబ్’తో సందీప్ రెడ్డి వంగ స్పెషల్ ఇంటర్వ్యూ.. ప్రోమో వైరల్..