They Call Him OG : హమ్మయ్య OG కూడా పూర్తయింది.. చెప్పిన డేట్ కి రిలీజ్.. పవన్ కొత్త పోస్టర్ వైరల్..

తాజాగా OG సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అంటూ అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్.

They Call Him OG

They Call Him OG : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా OG. సినిమా టైటిల్, గ్లింప్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచారు. పవన్ ఎక్కడ కనపడినా ఈ సినిమా గురించి ఫ్యాన్స్ అరుస్తారు. పవన్ రాజకీయాల వల్ల ఇన్ని రోజులు షూట్ వాయిదా పడగా ఇటీవల కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ OG షూట్ పూర్తిచేశారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25 దసరాకు రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.

తాజాగా OG సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అంటూ అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్. దాంతో పాటు రిలీజ్ డేట్ ని మరోసారి కంఫర్మ్ చేసారు. అలాగే ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకొని పవర్ ఫుల్ గా ఉన్నారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ అవ్వగా పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Soothravakyam : తెలుగు నిర్మాతలు మలయాళం సినిమా.. త్వరలో తెలుగులో..

DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. త్వరగా అప్డేట్స్ కూడా ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Allu Arjun : సమ్మర్ లో వైజాగ్ కి ‘అల్లు అర్జున్’.. భారీగా AAA రెడీ అవుతుందిగా..