Soothravakyam : తెలుగు నిర్మాతలు మలయాళం సినిమా.. త్వరలో తెలుగులో..
తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాని నిర్మించారు.

Soothravakyam
Soothravakyam : ఇటీవల మలయాళం సినిమాలు అందర్నీ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాని నిర్మించారు. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాండ్రేగుల లావణ్యదేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మాణంలో యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సూత్రవాక్యం. షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ కీలక పాత్రల్లో నటించారు.
సూత్రవాక్యం సినిమా మలయాళంలో నేడు జులై 11న రిలీజయింది. తెలుగు వర్షన్ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. జినీవెర్స్ మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా సూత్రవాక్యం టైటిల్ తోనే రిలీజ్ అవ్వనుంది.
Also Read : Allu Arjun : సమ్మర్ లో వైజాగ్ కి ‘అల్లు అర్జున్’.. భారీగా AAA రెడీ అవుతుందిగా..
పోలీస్ స్టేషన్స్ కు నేరాలు చేసినవాళ్ళు, నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక కొత్త ఆలోచనతో ఈ సినిమా తెరకెక్కింది. కోవిడ్ సమయంలో కేరళలో విదుర పోలీస్ స్టేషన్ లో యువతలో ధైర్యాన్ని నింపి, వారి కలలు, ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ కార్యక్రమాల స్పూర్తితోనే ఈ సూత్రవాక్యం సినిమా తెరకెక్కింది.
Also Read : Renu Desai : రేణు దేశాయ్ కి సర్జరీ.. ఏం సర్జరీ జరిగింది?