×
Ad

Balakrishna – Pawa Kalyan : బాలయ్య వల్లే OG రిలీజయింది.. తమ్ముడు పవన్ కి ఇచ్చేదామన్నారు.. బోయపాటి కామెంట్స్..

అఖండ 2 సినిమా ఇటీవల డిసెంబర్ 12న రిలీజయింది. (Balakrishna Pawa Kalyan)

Balakrishna Pawa Kalyan

Balakrishna – Pawa Kalyan : ఇటీవల సెప్టెంబర్ 25న దసరాకు OG సినిమా రిలీజయి పెద్ద విజయం సాధించింది. అయితే అదే రోజు బాలయ్య అఖండ 2 కూడా అనౌన్స్ చేసారు కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వక అఖండ 2ని వాయిదా వేశారన్నారు. తాజాగా దీనిపై అఖండ 2 దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడారు.

అఖండ 2 సినిమా ఇటీవల డిసెంబర్ 12న రిలీజయింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో దసరా బరి నుంచి అఖండ 2 సినిమా ఎందుకు తప్పుకుందో తెలిపారు.

Also See : Rashmika Mandanna : ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. ఫొటోలు వైరల్..

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అఖండ 2 సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుడే దసరాకు సెప్టెంబరు 25న రిలీజ్ చేస్తామని ప్రకటించాం. దానికి తగ్గట్లే 135 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి జూన్‌ చివరి కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయమని తమన్‌కి కూడా చెప్పాము. కానీ అదే సమయానికి ఓజీ కూడా రిలీజ్ కి రెడీ అయింది.

ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం కరెక్ట్ కాదు. రెండు సినిమాలు బాగున్నా థియేటర్లు షేర్‌ అయ్యి కలెక్షన్స్ తగ్గుతాయి. అందుకే బాలకృష్ణ గారు తమ్ముడు పవన్‌కు దారిద్దాం. మన సినిమా తర్వాత రిలీజ్ చేద్దామన్నారు. దాంతో మేము దసరా బరి నుంచి తప్పుకున్నాం, OG రిలీజయింది అని తెలిపారు.

Also Read : Gurram PaapiReddy : హీరో హీరోయిన్స్ ఓల్డ్ గెటప్ లో వస్తే ఎవరో అనుకున్నా.. బ్రహ్మానందం కామెంట్స్..