Pawan Kalyan : పవన్ నిర్ణయంతో వర్రీ అవుతున్న ఫ్యాన్స్

జనసేనాని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చెయ్యడానికి 2023 నుంచి పూర్తి స్థాయి రాజకీయాలకే సమయం కేటాయించబోతున్నారు..

Pawan Kalyan : పవన్ నిర్ణయంతో వర్రీ అవుతున్న ఫ్యాన్స్

Pspk

Updated On : October 20, 2021 / 2:57 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసి మళ్లీ తిరిగి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లి పోతున్నారనే వార్తతో పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు తెరపై కనిపించలేదు పవర్ స్టార్.

Chiranjeevi : కుడి చేతికి సర్జరీ చేశారు.. అభిమానులు ఆందోళన చెందకండి..

రీ ఎంట్రీతో ‘వకీల్ సాబ్’ గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘హరి హర వీర మల్లు’, సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘భీమ్లా నాయక్’, హరీష్ శంకర్‌‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలున్నాయి పవన్ చేతిలో.

Pawan Kalyan : ఇదీ పవర్‌స్టార్ స్టామినా.. అప్పుడు 5 వేలు.. ఇప్పుడు 50 కోట్లు..

ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న జనసేనాని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చెయ్యడానికి 2023 నుంచి పూర్తి స్థాయి రాజకీయాలకే సమయం కేటాయించబోతున్నారు. అప్పటికి కమిట్ అయిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు పవన్. ఈ నిర్ణయంతో తమ అభిమాన నటుణ్ణి తెర మీద చూసే ఛాన్స్ మిస్ అవుతున్నామంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.

Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..