Ante Sundaraniki: అంటే సుందరానికీ పవర్ ఇస్తోన్న పవన్!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే.. సుందరానికీ’’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే....

Pawan Kalyan To Grace Ante Sundaraniki Pre Release Event

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే.. సుందరానికీ’’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Ante Sundaraniki: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న సుందరం

అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. తొలుత ఈ వేడుకను జూన్ 8న నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ.. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తుండటంతో, ఆయన కోసం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జూన్ 9కి మార్చారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జూన్ 9న సాయంత్రం 6 గంటలకు మొదలుకానున్న అంటే సుందరానికీ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రేక్షకులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతారని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Ante Sundaraniki: అంటే.. సుందరానికీ అలా కుదిరింది!

పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఈవెంట్‌కు రావడం నిజంగా ఈ చిత్రానికి బూస్ట్ ఇస్తుందని చెప్పాలి. పవన్ ఈ సినిమా గురించి, నాని-నజ్రియాల గురించి ఏం మాట్లాడుతాడా అని అప్పుడే అభిమానులు చాలా ఎగ్జైటింగ్‌గా చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ రాకతో సుందరానికీ ఎలాంటి కిక్ వస్తుందో తెలియాలంటే జూన్ 9 వరకు వెయిట్ చేయాల్సిందే.