Pawan Kalyan: నాని హీరోయిన్‌తో పవన్ రొమాన్స్.. మామూలుగా ఉండదుగా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకుడు సుజిత్‌తో కలిసి చేస్తున్న సినిమా ‘ఓజి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక ఆరుల్ మోహన్‌ను సెలెక్ట్ చసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Pawan Kalyan: నాని హీరోయిన్‌తో పవన్ రొమాన్స్.. మామూలుగా ఉండదుగా..?

Pawan Kalyan To Romance Priyanka Arul Mohan

Updated On : April 11, 2023 / 5:48 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాను పూర్తి చేస్తున్నారు. ఇక తమిళ దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీలో పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను ముగించుకున్నాడు.

Pawan Kalyan : అకీరా బర్త్ డే రోజు రేణుదేశాయ్‌ని బాధ పెట్టిన పవన్ ఫ్యాన్స్.. మరి అలాంటి కామెంట్స్?

ఇక మరో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను స్టార్ట్ చేసిన పవన్, సుజిత్ డైరెక్షన్‌లో ‘ఓజి’ అనే సినిమాను కూడా తెరకెక్కించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాను సుజిత్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్‌ను సెలెక్ట్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు హీరోయిన్ కానీ, చిత్ర యూనిట్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Priyanka Arul Mohan: చీరకట్టులో గుండెల్ని దోచేస్తున్న గ్యాంగ్‌లీడర్ బ్యూటీ!

ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రియాంక ఆరుల్ మోహన్‌కు అదృష్టం పట్టినట్లే అని చెప్పాలి. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా, అమ్మడికి అనుకున్న మేర సక్సెస్ మాత్రం రాలేదు. ఇక పవన్ సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేస్తే మాత్రం అమ్మడికి వరుస అవకాశాలు రావడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరి ఓజి మూవీలో ప్రియాంక సందడి చేస్తుందా లేదా అనేది చూడాలి.