Pawan Kalyan: వీరమల్లు కోసం మరోసారి ఆ ఫీట్ చేస్తున్న పవన్.. నిజమేనా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ కోసం పవన్ మరోసారి పాటను పాడబోతున్నట్లుగా తెలుస్తోంది.

Pawan Kalyan To Sing A Song For Hari Hara Veera Mallu
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమాను ముగింపు దశకు రాగా, మరో క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో OG అనే సినిమాలోనూ పవన్ నటిస్తున్నాడు.
Pawan Kalyan OG : పవన్ అభిమానికి OG నిర్మాత డివివి బిర్యానీ పార్సిల్.. ఫోటో వైరల్!
క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుండటంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం పవన్ మరోసారి పాట పాడబోతున్నాడట.
Pawan Kalyan: ఓజి రంగంలోకి దిగిపోయాడు.. పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చిన పవన్!
గతంలోనూ పలు సినిమాల్లో పవన్ తన వాయిస్‌తో మ్యాజిక్ చేశాడు. ఇప్పుడు ఈ హిస్టారికల్ మూవీలో ఓ సాంగ్‌ను పవన్ పాడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండటంతో పవన్ ఎలాంటి పాటను పాడతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిజంగానే పవన్ ఈ సినిమాలో పాట పాడతాడా లేక ఇది కేవలం రూమర్ గానే మిగులుతుందా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.