Pawan Kalyan: పవన్ ‘ఓజి’ని అలా మొదలుపెడతాడా.. ఓపెనింగ్‌తోనే దద్దరిల్లడం ఖాయం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజిత్‌ డైరెక్షన్‌లో ‘ఓజి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేయాలని పవన్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

Pawan Kalyan: పవన్ ‘ఓజి’ని అలా మొదలుపెడతాడా.. ఓపెనింగ్‌తోనే దద్దరిల్లడం ఖాయం!

Pawan Kalyan To Start OG With Action Sequence

Updated On : April 9, 2023 / 3:35 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాను మెజారిటీ శాతం ముగించేసిన పవన్, దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కూడా ముగించేసుకున్నాడు.

Pawan Kalyan : అకీరా బర్త్ డే రోజు రేణుదేశాయ్‌ని బాధ పెట్టిన పవన్ ఫ్యాన్స్.. మరి అలంటి కామెంట్స్?

అటు మరో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర షూటింగ్‌ను ఇటీవల స్టార్ట్ చేశాడు పవన్. అయితే, ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మాత్రం యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో పవన్ చేస్తున్న సినిమా. ఈ ప్రాజెక్టును ఇప్పటికే అనౌన్స్ చేసి రోజులు గడుస్తుండగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం టెస్ట్ షూట్ జరుపుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు.

OG Movie: పవన్ కోసం ఆ టైటిల్‌నే ఫిక్స్ చేసిన సుజిత్..?

కాగా, ఈ షూటింగ్‌ను పవన్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను సుజిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌తో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే ఓజి సినిమాలో పవన్ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.