చిరూ బర్త్ డే సెలబ్రేషన్స్.. చీఫ్ గెస్ట్ గా పవన్

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరగబోతున్నాయి. గురువారం(ఆగస్టు-22,2019)చిరంజీవి 64వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ(ఆగస్టు-21,2019) సాయంత్రం 6 గంటలకు శిల్పకళావేదికలో చిరు బర్త్ డే వేడుకలను మెగా ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించబోతున్నారు. అయితే దీనికి మెగా హీరోలంతా హాజరు కానున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ వేడుకకు ప్రత్యేక అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు.
ప్రతి సంవత్సరం మెగా ఫ్యాన్స్ నిర్వహించే మెగాస్టార్ బర్త్‌డే వేడుకకు ఈసారి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు కన్ఫర్మ్ చేసాడు.
ఇక చిరు నటించిన సైరా నర్సింహారెడ్డి రిలీజ్ కు ముందే సంచలనాలు సృష్టస్తుంది. టీజర్, మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే టీజర్ 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.