జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. నేను దిగితే ఢీ కొట్టేదెవరు..

యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్‌లో నెం.1 ప్లేస్‌లో ‘మగువా మగువా’ సాంగ్..

జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. నేను దిగితే ఢీ కొట్టేదెవరు..

Pawankalyans Maguva Maguva Trending 1 Youtube India 27699

Updated On : May 14, 2021 / 12:14 PM IST

యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్‌లో నెం.1 ప్లేస్‌లో ‘మగువా మగువా’ సాంగ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ (పింక్) రీమేక్ ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తూ పవర్ స్టార్ స్టామినా ఏంటనేది మరోసారి తెలియచేసింది. హిందీ (పింక్), తమిళ్ (నేర్కొండపార్వై) భాషల్లో చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ‘వకీల్ సాబ్’ నుంచి ‘మగువా మగువా’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. మహిళల త్యాగం, గొప్పదనం తెలుపుతూ రూపొందించిన ఈ పాటను మహిళలందరికీ అంకితమిచ్చారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజిషన్లో లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడగా రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన పదాలు రాశారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్‌లో నెం.1 ప్లేస్‌లో కొనసాగుతోంది.

‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా’.. మగువా మగువా.. నీ సరిహద్దులు కలవా’.. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా.. పరుగులు తీస్తావు ఇంటా బయటా.. అలుపని రవ్వంతా అననే అనవంటా.. వెలుగులు పూస్తావు దారంతా’.. అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని వేసవి కానుకగా మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

See Also | మహిళలు మహా శక్తివంతులు.. మహేష్ బాబు ‘వుమెన్స్ డే’ ట్వీట్

PawanKalyan’s Maguva Maguva is Trending at 1 on Youtube India