Payal Ghosh : సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తే నన్ను చూపించడానికి నా బట్టలిప్పేవాళ్లు..

తాజాగా పాయల్ ఘోష్ మరోసారి వైరల్ గా మారింది. బాలీవుడ్ పై ఓ సంచలన ట్వీట్ చేసి పాయల్ ఘోష్ వైరల్ అయింది.

Payal Ghosh : సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తే నన్ను చూపించడానికి నా బట్టలిప్పేవాళ్లు..

Payal Ghosh Sensational Comments on Bollywood

Updated On : October 2, 2023 / 10:43 AM IST

Payal Ghosh :  తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి లాంటి పలు సినిమాలతో మెప్పించిన పాయల్ ఘోష్ చివరగా 2017లో ఓ హిందీ సినిమాలో కనిపించింది. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఓ రాజకీయ పార్టీలో చేరి రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవ్వడానికి చూస్తుంది పాయల్ ఘోష్. అప్పుడప్పుడు పలు వివాదాల్లో కూడా నిలిచింది. ఇటీవల మళ్ళీ పలు సిరీస్, సినిమాలు, యూట్యూబ్ వీడియోల్లో నటించడానికి రెడీ అయింది.

తాజాగా పాయల్ ఘోష్ మరోసారి వైరల్ గా మారింది. బాలీవుడ్ పై ఓ సంచలన ట్వీట్ చేసి పాయల్ ఘోష్ వైరల్ అయింది. టీజగా పాయల్ తన ట్వీట్ లో.. సౌత్ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. ఒకవేళ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నన్ను చూపించడానికి నా బట్టలు తీసేసేవాళ్ళేమో. ఎందుకంటే వాళ్ళు క్రియేటివిటీ కంటే అమ్మాయిల శరీరాల్ని చూపించడమే వాడతారు సినిమాల్లో అని ట్వీట్ చేసింది.

Also Read : Samantha : ఆస్ట్రియా అయిపొయింది.. ఇప్పుడు ఇటలీ.. యూరప్ మొత్తాన్ని చక్కర్లు కొట్టేస్తున్న సమంత..

ఈ రేంజ్ లో బాలీవుడ్ పై ట్వీట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఇప్పటికే పలువురు నటీనటులు బాలీవుడ్ పై గతంలో కూడా అనేక సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరి పాయల్ చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా బాలీవుడ్ లో స్పందిస్తారేమో చూడాలి.