డ్రగ్స్ తీసుకునే హీరోలు ఎవరో నాకు తెలుసు.. ఆ డైరెక్టర్ నాకు పోర్న్ చూపించాడు..

  • Published By: sekhar ,Published On : September 14, 2020 / 12:23 PM IST
డ్రగ్స్ తీసుకునే హీరోలు ఎవరో నాకు తెలుసు.. ఆ డైరెక్టర్ నాకు పోర్న్ చూపించాడు..

Updated On : September 14, 2020 / 12:46 PM IST

Payal Ghosh talks about drugs in Bollywood: యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌లో నెపోటిజం(బంధుప్రీతి) గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతలో డ్రగ్స్ వ్యవహారం బయటపడడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రియా చక్రవర్తి అరెస్ట్ కావడం, విచారణలో ఆమె 25మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పినట్లు వార్తలు రావడంతో హిందీ పరిశ్రమలో వాతావరణం వేడెక్కింది. ఎప్పుడేంజరుగుతుందో తెలియని పరిస్థితి..



https://10tv.in/biggboss-4-telugu-gangavva-has-plan-to-win-title/
మరోవైపు ‘మీ టు’ గురించి తరచూ కథనాయికలు చెబుతూనే ఉన్నారు. తాజాగా హీరోయిన్ పాయల్ ఘోష్ బాలీవుడ్‌లో చాలామంది డ్రగ్స్ తీసుకుంటారని, మాదకద్రవ్యాలు తీసుకునే హీరోలెవరో తనకు తెలుసునని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా పాయల్ డ్రగ్స్ వ్యవహారం గురించి, తనకెదురైన మీ టు ఘటన గురించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.


‘‘బాలీవుడ్ నటులందరూ డ్రగ్స్ తీసుకుంటారని నేను చెప్పడం లేదు. కొంతమంది ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెడతారు. కానీ, ఎక్కువ మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. డ్రగ్స్ తీసుకునే హీరోలు నాకు తెలుసు’’ అని పాయల్ చెప్పింది. అలాగే గతంలో తానెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కూడా ఆమె మాట్లాడింది.


‘‘చాలా కాలం క్రితం నేను ఓ దర్శకుడిని కలిశాను. బాలీవుడ్‌కు కొత్త నటీనటుల్ని పరిచయం చేయడంలో అతడికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అతడు నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. ఒకసారి అతను నన్ను తన ఆఫీస్‌లోని ఓ గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిల్మ్ చూపించాడు. ‘మళ్లీ కలుస్తాను’ అని చెప్పి లేచాను. ‘నాకు చాలామంది హీరోయిన్లు తెలుసు. ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి నాతో గడిపి వెళ్లిపోతారని చెప్పాడ’ని పాయల్ వెల్లడించింది.


దీంతో పాయల్‌కు తెలిసిన డ్రగ్స్ తీసుకునే హీరోలు ఎవరు, ఆ బడా డైరెక్టర్ ఎవరై ఉంటారబ్బా.. అంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంచు మనోజ్ ‘ప్రయాణం’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన పాయల్ ఆ తర్వాత ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమాలో తమన్నా ఫ్రెండ్‌గా నటించింది.