Kajal Vs Payal : పోలీస్ వర్సెస్ పోలీస్.. సత్యభామతో పోటీకి వస్తున్న పాయల్ రాజ్‌పుత్..

ఇద్దరు హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్ గా చేస్తున్న సినిమాలు సత్యభామ, రక్షణ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి.

Kajal Vs Payal : పోలీస్ వర్సెస్ పోలీస్.. సత్యభామతో పోటీకి వస్తున్న పాయల్ రాజ్‌పుత్..

Payal RajPuth Rakshana Movie Releasing date Announced

Updated On : May 28, 2024 / 10:49 AM IST

Kajal Aggarwal Vs Payal Rajputh : కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ చేసే యాక్షన్ సీన్స్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. సత్యభామ సినిమా పలు మార్లు వాయిదా పడి జూన్ 7న రాబోతుంది.

Image

తాజాగా అదే రోజు జూన్ 7న పాయల్ రాజ్ పుత్ పోలీస్ గా నటించిన రక్షణ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించింది. రోష‌న్‌, మాన‌స్.. పలువురు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Payal RajPut Rakshana Movie Releasing date Announced

Also Read : Rashmika Mandanna : బేబీ సినిమా చూసి ఏడ్చేశాను.. బేబీ డైరెక్టర్ పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..

‘రక్షణ’ సినిమా ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ.. ఇటీవల రిలీజ్ చేసిన రక్షణ టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వచ్చింది. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కింది ఈ సినిమా. పాయిల్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో ఈ సినిమాని తెరకెక్కించాం, సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ రక్షణ సినిమాని జూన్ 7న విడుద‌ల చేస్తున్నాం అని తెలిపారు.

 

దీంతో ఇద్దరు హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్ గా చేస్తున్న సినిమాలు సత్యభామ, రక్షణ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. వీటికి తోడు శర్వానంద్ మనం సినిమా కూడా ఇదే రోజు రిలీజ్ అవుతుండటం గమనార్హం.