పవర్ ఫుల్ ‘పహిల్వాన్’: ట్రైలర్ చూశారా?

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఎస్.కృష్ణ దర్శకత్వంలో నటించిన సినిమా పహిల్వాన్. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం సుదీప్ కుస్తీ పోటీలు కూడా నేర్చుకున్నారు.
ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయించారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ ట్రైలర్ లో డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘బలం ఉందనే అహాంతో కొట్టేవాడు రౌడీ.. బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’ అనే పవర్ ఫుల్ డైలాగ్ ఇందులో హైలెట్ గా నిలిచింది.
సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న ఈ సినిమాలో సుదీప్ కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి మీరుమ కూడా ట్రైలర్ పై ఓ లుక్కేయండి.