Pen Drive : పెన్ డ్రైవ్ మూవీ ఓపెనింగ్.. లా చదివిన వ్యక్తి హీరోగా మారి..
నేను లా చేశాను. సినిమాల మీద ఆసక్తితో పరిశ్రమలోకి వచ్చాను. పెన్ డ్రైవ్ మూవీ హీరోగా నాకు మంచి పేరు తెస్తుందని..

Pendrive Movie Opening Ceremony sai kumar as Guest
Pen Drive : విష్ణు వంశీ, రియా కపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా పెన్ డ్రైవ్. శ్రీ కృష్ణ మూవీస్ బ్యానర్ పై కటకం వెంకటేశ్వర్లు సమర్పణలో K రామకృష్ణ నిర్మాణంలో MR దీపక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు దసరా సందర్భంగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సాయి కుమార్ క్లాప్ కొట్టగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయగా నిర్మాత కె రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Also Read : Tejaswini Nandamuri : బాలకృష్ణ రెండో కూతురు తేజస్వి ఫొటోలు చూశారా..? ఎంత క్యూట్ గా ఉందో..
ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో సాయి కుమార్ మాట్లాడుతూ.. నిన్ననే కథ విన్నాను, చాలా బాగుంది. నా పాత్ర కూడా చాలా బాగా రాశారు. ఇందులో నా పేరు కూడా నాకు చాలా నచ్చింది. సినిమా మంచి సక్సెస్ అయి అందరికి పేరు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరో విష్ణు వంశీ మాట్లాడుతూ.. దర్శకుడు దీపక్ గారు చెప్పిన కథ విని చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను లా చేశాను. సినిమాల మీద ఆసక్తితో పరిశ్రమలోకి వచ్చాను. పెన్ డ్రైవ్ మూవీ హీరోగా నాకు మంచి పేరు తెస్తుందని భావిస్తున్నా అని తెలిపారు.
నిర్మాత కె రామకృష్ణ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో పెన్ డ్రైవ్ మూవీని దసరా రోజు లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మా మూవీ ఓపెనింగ్ కు వచ్చిన గెస్ట్ లకు ధన్యవాదాలు అని తెలిపారు. దర్శకుడు ఎంఆర్ దీపక్ మాట్లాడుతూ.. టెక్నాలజీ సద్వినియోగం చేసుకోకుండా కొందరు దుర్వినియోగం చేస్తూ క్రైమ్స్ చేస్తున్నారు. అలంటి కథాంశంతో ఈ సినిమాని తీస్తున్నాను. అలాగే ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఉచితంగా వచ్చే దేనికీ ఆశపడకూడదు, అలా ఆశపడితే ఇబ్బందులు వస్తాయనే అంశాన్ని చూపిస్తున్నాను. అక్టోబర్ 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి నాలుగు షెడ్యూల్స్ లో సినిమా పూర్తి చేస్తాను అని తెలిపారు.