Yash : రాత్రి పూట భార్య కోసం.. రోడ్డు మీద షాప్‌లో ఐస్ క్యాండీ కొంటున్న యశ్.. స్టార్ హీరో అయినా

సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉంటారు రాకింగ్ స్టార్ యష్. రోడ్డుపై ఉన్న కిరాణా షాపులో ఐస్-క్యాండీ కొంటూ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Yash : రాత్రి పూట భార్య కోసం.. రోడ్డు మీద షాప్‌లో ఐస్ క్యాండీ కొంటున్న యశ్.. స్టార్ హీరో అయినా

Yash

Updated On : February 17, 2024 / 3:03 PM IST

Yash : కర్నాటకలోని ఒక చిన్న గ్రామంలో ఉన్న కిరాణా షాపుకి రాకింగ్ స్టార్ యష్ వెళ్లారు. తన భార్యకు ఐస్-క్యాండీ కొంటూ కనిపించారు. తన స్టార్ డమ్ పక్కన పెట్టి సింపుల్‌గా ఉండే యష్ నేచర్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు.

Chiranjeevi : అమెరికాలో మెగాస్టార్, వెంకిమామ.. ఒకే పెళ్ళిలో సందడి చేస్తూ..

ఇటీవల యష్ తన భార్య రాధిక పండిట్, పిల్లలు ఐరా,యథర్వ్‌లతో కలిసి కర్నాటక షిరాలీలోని చిత్రపూర్ మఠానికి వెళ్లారు. ఆ సందర్భంలో రాత్రివేళ  షిరాలీ గ్రామంలోని ఓ కిరాణా షాపు బయట యష్ కనిపించారు. తన భార్య కోసం ఐస్ క్యాండీ కొన్నారు. ఆ ఫోటోలో భార్య రాధిక కూడా ఉన్నారు. యష్ కిరణా షాపు ముందు కనిపించిన కాసేపటికి తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్’ అని.. ‘తను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ప్రతీదీ ఎంజాయ్ చేయగలరు’ అని అభిమానులు కామెంట్స్ చేసారు. నిజంగానే యష్ సింప్లిసీటీని అభిమానించే వాళ్లు అనేకమంది ఉన్నారు. కన్నడనాట యష్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Suhani Bhatnagar : చిన్న వయసులోనే ‘దంగల్’ నటి మరణం.. కాలు గాయం ప్రాణం తీసింది..

KGF2 సినిమా తర్వాత యష్ ‘టాక్సిక్’ అనే మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.