చిన్న వయసులోనే ‘దంగల్’ నటి మరణం.. కాలు గాయం ప్రాణం తీసింది..

చిన్న వయసులోనే కన్నుమూసిన 'దంగల్' నటి. కాలుకి అయ్యిన గాయం ప్రాణం తీసేసింది.

చిన్న వయసులోనే ‘దంగల్’ నటి మరణం.. కాలు గాయం ప్రాణం తీసింది..

Dangal fame Suhani Bhatnagar passed away at the age of 19

Suhani Bhatnagar : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా.. ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికి టాప్ గ్రాసర్ స్థానంలో నిలిచింది. ఇక ఈ మూవీలో ఆమిర్ తో పాటు ప్రధాన పాత్రల్లో హీరో కూతుళ్లుగా నటించిన ఫాతిమా, సన్యా, సుహాని భట్నాగర్ కూడా తమ నటనతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ సినిమా తరువాత ఈ ముగ్గురికి ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్స్ ని ఫాతిమా, సన్యా అందిపుచ్చుకొని వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చారు. కానీ సుహాని మాత్రం.. యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోని స్టడీస్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే సినిమాలకు దూరమయ్యి స్టడీస్ లో బిజీ అయ్యింది. అయితే వెండితెరపై కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్‌ని పలకరిస్తూ ఉండేవారు.

Also read : Ranveer Singh : బాబోయ్.. ఒక్క యాడ్‌కి రణ్‌వీర్ సింగ్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటాడా?

తనకి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ వచ్చేది సుహాని. ఆ పిక్స్ లో సుహాని ట్రాన్స్‌ఫార్మేషన్, అందం చూసి నెటిజెన్స్ ఫిదా అయ్యేవారు. ఆమె అందాన్ని వెండితెరపై కూడా చూడాలని, సుహాని ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. షాకింగ్ న్యూస్ ఎదురైంది. 19 ఏళ్ళ వయసులోనే సుహాని మరణించిందన్న వార్త అందర్నీ షాక్ కి గురి చేసింది.

కొన్నాళ్ల క్రిందట సుహానికి ప్రమాదం అయ్యి కాలుకి గాయం అయ్యింది. ఇక ఆ చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానిపై దుష్ప్రభావం చూపాయి. దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా లాభం లేకుండా పోయింది. దీంతో చిన్న వయసులోనే ఆమె కన్నుమూసింది. సుహాని భట్నాగర్ మరణం పట్ల బాలీవుడ్ నటీనటులతో పాటు ఇతరులు సంతాపం తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Suhani Bhatnagar (@bhatnagarsuhani)