Suresh Gopi Daughter Wedding : సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి హాజరైన మోదీ

నటుడు సురేష్ గోపీ కుమార్తె వివాహం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు.

Suresh Gopi Daughter Wedding

Suresh Gopi Daughter Wedding : నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. వధూవరులు భాగ్య, శ్రేయాస్ మోహన్‌లను ఆశీర్వదించారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో జరిగిన ఈ వేడుకలో మోదీ హాజరు కావడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Rakul Preet Singh : మేకప్ లేకుండా రకుల్‌ని ఎప్పుడైనా చూసారా? నో మేకప్ అంటూ ఫోటో పోస్ట్..

మళయాళ నటుడు, బీజేపీ లీడర్ సురేష్ గోపీ కుమార్తె భాగ్య వివాహం శ్రేయాస్ మోహన్‌తో ఘనంగా జరిగింది. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళలో ఉన్న మోదీ గురువాయూర్ చేరుకుని ఆలయ మండపంలో జరిగిన సురేష్ గోపీ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో మోదీతో పాటు మమ్ముట్టి, మోహన్ లాల్, జయరామ్, దిలీప్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు.

Priyanka Chopra Daughter : ప్రియాంక చోప్రా కూతురు.. సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలు..

ఆలయంలో గంటసేపు గడిపిన మోదీ అనంతరం కేరళలోని ప్రముఖ రామాలయాల్లో ఒకటైన త్రిసూర్ జిల్లాలోని త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయానికి వెళ్లారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లో రూ.4000 విలువైన మూడు ప్రధాన మౌళిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.