PM Narendra Modi : నిజం బయటకు రావడం మంచిది.. ఆ సినిమాపై నరేంద్ర మోదీ ప్రశంసలు..

ది సబర్మతి రిపోర్ట్ సినిమా ఇటీవల నవంబర్ 15 న రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాపై ప్రధాని మోదీ కామెంట్స్ చేసారు.

PM Narendra Modi Appriciates The Sabarmati Report Movie Tweet goes Viral

PM Narendra Modi : గుజరాత్ లో జరిగిన గోద్రా రైలు ఘటన, ఆ తర్వాత గుజరాత్ లో చెలరేగిన అల్లర్లు మీద పలు డాక్యుమెంటరీలు రాగా తాజాగా ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే సినిమా వచ్చింది. గోద్రా రైలు ఘటన జరిగిన సమయంలో గుజరాత్ ప్రధానిగా నరేంద్రమోదీ ఉన్నారు. 12th ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాస్సే, రాఖీ ఖన్నా, రిద్ది డోగ్రా, బర్కా సింగ్.. పలువురు ముఖ్య పాత్రల్లో ది సబర్మతి రిపోర్ట్ సినిమా తెరకెక్కించారు. ఏక్తా కపూర్ నిర్మాణంలో ధీరజ్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Also Read : Sri Simha Pre Wedding : కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. హాజరైన రాజమౌళి, మహేష్ బాబు..

ది సబర్మతి రిపోర్ట్ సినిమా ఇటీవల నవంబర్ 15 న రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాపై ప్రధాని మోదీ కామెంట్స్ చేసారు. ఓ నెటిజన్ ది సబర్మతి రిపోర్ట్ సినిమాను కచ్చితంగా చూడాలి అని పలు పాయింట్స్ తో ఓ ట్వీట్ చేసాడు. దీనికి మోదీ స్పందిస్తూ.. కరెక్ట్ గా చెప్పారు. ఈ నిజం బయటకు రావడం మంచిదే. సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా ఇలా చూపించడం మంచి విషయం. ఒక నకిలీ కథనం కొంతకాలం వరకు మాత్రమే సాగుతుంది. నిజాలు ఎప్పటికో బయటకు వస్తాయి అంటూ ట్వీట్ చేసారు. దీంతో మోదీ ట్వీట్ వైరల్ గా మారింది.

గోద్రా రైలు ఘటన, గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోదీనే ముఖ్యమంత్రిగా ఉండటంతో మోదీపై కొందరు తీవ విమర్శలు గుప్పించారు. అందుకే మోదీ ఇప్పుడు దానికి సంబంధించిన సినిమాపై ఇలా నిజం బయటకు వచ్చింది అంటూ స్పందించారని తెలుస్తుంది.