Sri Simha Pre Wedding : కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. హాజరైన రాజమౌళి, మహేష్ బాబు..

తాజాగా కీరవాణి కొడుకు శ్రీ సింహ, మురళి మోహన్ మనవరాలు రాగ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగాయి.

Sri Simha Pre Wedding : కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. హాజరైన రాజమౌళి, మహేష్ బాబు..

Keeravani Son Hero Sri Simha Pre Wedding Celebrations Rajamouli and Mahesh Babu Attended

Updated On : November 18, 2024 / 8:51 AM IST

Sri Simha Pre Wedding : కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే మత్తు వదలరా 2 సినిమాతో మంచి హిట్ కొట్టాడు. తాజాగా ఈ హీరో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా శ్రీ సింహ, సీనియర్ నటుడు మురళి మోహన్ మనవరాలితో పెళ్లి జరగనుందని వార్తలు వచ్చాయి. మురళి మోహన్ కొడుకు కూతురు రాగ విదేశాల్లో చదువుకొని వచ్చి ప్రస్తుతం కుటుంబ వ్యాపారాలు చూసుకుంటుంది. ఆమెతోనే శ్రీ సింహ పెళ్లి కాబోతుంది.

Also Read : Vishwak Sen : ఎవ్వరూ ఏమి పీకలేరు.. నేను ఇలాగే మాట్లాడతా.. ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన విశ్వక్ సేన్..

తాజాగా కీరవాణి కొడుకు శ్రీ సింహ, మురళి మోహన్ మనవరాలు రాగ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రాజమౌళి ఎలాగో శ్రీ సింహకు బాబాయ్ అవుతాడు కాబట్టి రాజమౌళి ఫ్యామిలీ కూడా ఈ ఫంక్షన్ కు విచ్చేసారు. అయితే ఇదే ఈవెంట్ కు మహేష్ బాబు కూడా వచ్చి సందడి చేసాడు.

Image

శ్రీ సింహ ప్రీ సెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు మహేష్ వచ్చిన ఫోటో వైరల్ గా మారింది. అలాగే ఈ ఫంక్షన్ నుంచి పలు ఫోటోలు లీక్ అయ్యాయి. కొన్ని రోజుల్లోనే శ్రీ సింహ – రాగ పెళ్లి జరగబోతుంది.

Image

 

Image