Podagantimayya Ninnu Purushottama : ‘పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ’ మోషన్ పోస్టర్..
యతింద్ర, రమ్య దినేష్ జంటగా నటిస్తున్న చిత్రం పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ(Podagantimayya Ninnu Purushottama ).
Podagantimayya Ninnu Purushottama Motion Poster out now
Podagantimayya Ninnu Purushottama : యతింద్ర, రమ్య దినేష్ జంటగా నటిస్తున్న చిత్రం పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ. ఏ ఫణీంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కొలచెల డ్రీమ్ వర్క్స్ పతాకంపై సురేఖ కొలచెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ మూవీ ఓ ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ చిత్రం అని చెప్పారు. ఓ రాత్రి సమయంలో ఓ హాస్పిటల్ చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని అన్నారు. హీరో యతీంద్ర ఈ మూవీలో ఒక విభిన్నమైన బ్రాహ్మణ గెటప్‌లో కనిపించనున్నారని తెలిపారు.
Anchor lasya : శ్రీరామ నవమి స్పెషల్.. నిండైన చీరకట్టులో యాంకర్ లాస్య.. ఫోటోలు వైరల్..
ఇక ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ గురించి వివరించారు. ఏప్రిల్ 15 తరువాత అమలాపురం, ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.
