Jeevan Reddy: బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి? ముహూర్తం ఫిక్స్..! భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
సభా స్థలాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు స్వయంగా వచ్చి పరిశీలించబోతున్నట్లు సమాచారం.
Jeevan Reddy: మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసిన జీవన్ రెడ్డి తన తదుపరి కార్యాచరణకు సిద్ధమైనట్లుగా సమాచారం. అందులో భాగంగా ఆయన బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 10న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా 15 ఎకరాల స్థలంలో సభకు జీవన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ లో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి సభా స్థలాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు స్వయంగా వచ్చి పరిశీలించబోతున్నట్లు సమాచారం.
పార్టీలో చేరికపై ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం జీవన్ రెడ్డితో మాట్లాడినట్లు సమాచారం. బీఆర్ఎస్ లో చేరికకు జీవన్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో దాదాపు 15 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సభ ఏర్పాట్లను రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు పరిశీలించబోతున్నారు. జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన బలం ఏంటో నిరూపించుకునే ప్రయత్నం జీవన్ రెడ్డి చేయబోతున్నారు. కాంగ్రెస్ లో 40 ఏళ్లు ఉన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి తాను ఏంటో నిరూపించుకోవాలనే కసితో జీవన్ రెడ్డి ఉన్నట్లుగా అర్థమవుతోంది.
Also Read: కొత్త పార్టీ ఏర్పాటుపై కవితక కీలక ప్రకటన.. ఏప్రిల్ లో ముహుర్తం ఫిక్స్.. అదే రోజు
