Telangana Board Merge : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. బడిలోనే ఇంటర్ పాఠాలు.. విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పుకు సర్కార్ శ్రీకారం..
Telangana Govt : కొత్త విద్యా సంవత్సరం (2026-27) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే, పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలంటే ఆ రెండు చట్టాలను కలిపి ఒకదాన్ని రూపొందించాలి. అందుకు పాఠశాల విద్యకు సంబంధించి తెలంగాణ విద్యాచట్టాన్ని సవరించాలని, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Intermediate education
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- పదికి, ఇంటర్‌కు ఇక ఒకటే బోర్డు
- త్వరలోనే ఆర్డినెన్స్ జారీకి నిర్ణయం
Telangana Board: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఓ భారీ మార్పునకు నాంది పడబోతోంది. పదేళ్ల పాఠశాల విద్య తరువాత విద్యార్థులు ఇంటర్మీడియట్ కోసం జూనియర్ కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తాము చదువుకున్న స్కూల్లోనే ప్లస్ 2 పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ విధానాన్ని 2026-27 విద్యా సంవత్సరం నుంచే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో ప్రారంభించేందుకు విద్యాశాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
కొత్త విద్యా సంవత్సరం (2026-27) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే, పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలంటే ఆ రెండు చట్టాలను కలిపి ఒకదాన్ని రూపొందించాలి. అందుకు పాఠశాల విద్యకు సంబంధించి తెలంగాణ విద్యాచట్టాన్ని సవరించాలని, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర విద్యాశాఖ సైతం ప్రతి రాష్ట్రంలో పది, ఇంటర్‌కు ఒకే బోర్డు ఉండాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ప్రస్తుతమున్న ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్ఎస్సీ బోర్డు), ఇంటర్మీడియట్ విద్యా మండలి (ఇంటర్ బోర్డు)ని కలిపి ఒకే ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి బోర్డుగా మారితే జూనియర్ కళాశాలలు సైతం పాఠశాల విద్య పరిధిలోకి వస్తాయి.
సాధారణంగా మే నెలలో విడుదలయ్యే ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ఈసారి విడుదల చేసిన మరుసటి రోజే హఠాత్తుగా రద్దు చేయడం విద్యా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ ప్లస్ 2 ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డులను ఒకటిగా చేసి.. దానికి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీజీఎస్ఈబీ)గా నామకరణం చేస్తారని తెలుస్తోంది. ఈ కొత్త విధానం వల్ల డ్రాపౌట్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
పాఠశాల విద్యలోకి ఇంటర్ ను తీసుకొస్తే సమగ్ర శిక్షా, పీఎం శ్రీ తదితర పథకాల కింద నిధులు పొందొచ్చునని.. మౌలిక సదుపాయలు పెంచుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక.. పాఠశాలల్లోనూ పూర్తిస్థాయి ల్యాబ్‌లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జూనియర్ కాలేజీల్లో సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయి. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు వేరువేరుగా ఉండటం వల్ల వేరువేరు ల్యాబ్‌లు అవసరం ఉండదు. గ్రంథాలయాలను, ఇతర సౌకర్యాలను సమర్థంగా వాడుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.
