Kavitha New Party in April : కొత్త పార్టీ ఏర్పాటుపై కవితక కీలక ప్రకటన.. ఏప్రిల్ లో ముహుర్తం ఫిక్స్.. అదే రోజు
Kavitha New Party in April : కొత్త పార్టీ ఏర్పాటుపై కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు.
in nizamabad kalvakuntla kavitha said declare new party name flag on 2026 april 25
Kavitha New Party in April : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శ్రీరామనవమి నాడు కీలక ప్రకటన చేశారు. నేడు నిజామాబాద్‌లో పర్యటించిన కవిత.. కొత్త పార్టీ ప్రకటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందన్నారు. సర్వోదయ తెలంగాణ కోసం కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేడు నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్త పార్టీపై ప్రకటన చేస్తానన్నారు కవిత. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఈ ప్రకటన ఉంటుందని తెలిపారు. సుమారు 35 వేల మంది కార్యకర్తల సమక్షంలో పార్టీ ప్రకటన చేయబోతున్నారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలందరూ భారీగా తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు. శ్రీరాముని దయతో అందరినీ కలుపుకుపోయే పార్టీ తమది అవుతుందన్నారు. ఏప్రిల్ 25న పార్టీ జెండా ఆవిష్కరిస్తానని తెలిపారు. మార్పు కోరుకునే అభ్యుదయవాదులంతా కలిసి రావాలని కవిత పిలుపునిచ్చారు.
