Anna Lezhneva: పవన్ లాగే భార్య అన్నా లెజినోవా కూడా.. నెలలో ఇన్ని పుస్తకాలు చదివిందట.. ఫోటోలు షేర్ చేశారు
పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఆయన భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva)కు కూడా పుస్తక పఠనం అంటే అమితమైన ఇష్టం. ఇటీవల ఆమె ఒకే నెలలో ఏకంగా పదికి పైగా పుస్తకాలను చదివి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, భార్యాభర్తలిద్దరి అభిరుచులు ఒకేలా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.








