Taapsee Pannu : తాప్సీ పై కేసు పెట్టిన ఎమ్మెల్యే కొడుకు..
సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లిన స్టార్స్ కూడా అక్కడి కల్చర్ ని అలవాటు చేసుకుంటూ హిందీ ప్రేక్షకుల చేతే విమర్శలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడో సౌత్ నుంచి నార్త్ కి చెక్కేసిన తాప్సీ (Taapsee Pannu) పై ఏకంగా కేసు నమోదు అయ్యింది.

Police Case filed on Taapsee Pannu in madhya pradesh
Taapsee Pannu : బాలీవుడ్ లోని స్టార్స్ పై ఎంత వ్యతిరేకత వస్తున్న అక్కడి తారలు మాత్రం వాళ్ళ పద్ధతి మార్చుకోవడం లేదు. అదేంటో సౌత్ నుంచి నార్త్ లోకి వెళ్లిన తారలు కూడా అక్కడ స్టార్స్ మాదిరి ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన రష్మిక మందన్న (Rashmika Mandanna) తన డ్రెస్సింగ్ స్టైల్ తో బాలీవుడ్ ఆడియన్స్ కి సైతం విసుగు తెప్పిస్తుంది. బాలీవుడ్ లోకి రాగానే మీ అందరికి ఏమవుతుంది అంటూ హిందీ ప్రేక్షకులే నిలదీశారు. అలాగే రాశి ఖన్నా (Raashi Khanna) డ్రెస్సింగ్ కూడా ఈ మధ్య శృతి మించుతోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో సౌత్ నుంచి నార్త్ కి చెక్కేసిన తాప్సీ (Taapsee Pannu) పై ఏకంగా కేసు నమోదు అయ్యింది.
ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో తాప్సీ పాల్గొంది. ఈ ఫ్యాషన్ షోలో ఈ అమ్మడి డ్రెస్ మరి శృతిమించి ఉంది. రెడ్ డ్రెస్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఎద భాగం ఎక్కువగా కనిపించేలా స్కిన్ షో చేసింది. అటువంటి డ్రెస్సింగ్ స్టైల్ లో ఉండగా మెడలో పెద్ద లక్ష్మి దేవి ముద్ర ఉన్న హారాన్ని వేసుకొని ఫ్యాషన్ వాక్ చేసింది. ఇక అలాంటి డ్రెస్ లో తాప్సీ లక్ష్మి దేవి హారాన్ని వేసుకోవడం అందర్నీ ఇబ్బందికి గురి చేసింది. దీంతో మధ్యప్రదేశ్ కి చెందిన ఎమ్మెల్యే కొడుకు తాప్సీ పై పోలీస్ కేసు పెట్టాడు.
Hari Hara Veera Mallu: వీరమల్లు సైలెంట్ కావడంతో అభిమానుల్లో మళ్లీ కన్ఫ్యూజన్..?
మధ్యప్రదేశ్ ఇండోర్ లోని పోలీసులకు ఎమ్మెల్యే తనయుడు పిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నివేదిక ప్రకారం.. తాప్సీ అటువంటి డ్రెస్ లో లక్ష్మి దేవి హారాన్ని ధరించడంతో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని.. ఆమె పై చర్యలు తీసుకోవాలంటూ పేర్కొన్నాడు. మరి దీని పై తాప్సి ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా తాప్సీ తెలుగు సినిమా ‘ఝుమ్మంది నాదం’తో వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెట్టిల్ అయ్యిపోయి, అక్కడ వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది.
View this post on Instagram