Ravi Teja Mother: రవితేజ తల్లిపై కేసు నమోదు.. కారణం ఏంటంటే?

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తున్నాడు. రెండేళ్ల క్రితం వరకు వరస ప్లాపులతో సతమతమైన రవితేజ క్రాక్ ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు వరస సినిమాలను

Ravi Teja Mother: రవితేజ తల్లిపై కేసు నమోదు.. కారణం ఏంటంటే?

Ravi Teja Mother

Updated On : January 21, 2022 / 6:09 PM IST

Ravi Teja Mother: టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తున్నాడు. రెండేళ్ల క్రితం వరకు వరస ప్లాపులతో సతమతమైన రవితేజ క్రాక్ ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు వరస సినిమాలను లైనప్ సెట్ చేసి దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదారు సినిమాలుండగా రెండు సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి.

RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

కాగా.. ఇప్పుడు రవితేజ తల్లిపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. రవితేజ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన కేసులో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మిపై కేసు నమోదైంది. ఇదే కేసులో మర్రిపాకకు చెందిన సంజయ్‌లపై కూడా కేసు నమోదైంది.

Samantha: సామ్ ఛలో ముంబై.. బాలీవుడ్‌లో బేబీ దూకుడు!

సర్వే నంబర్ 108, 124లో గల పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను రాజ్యలక్ష్మి, సంజయ్ లు ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా రవితేజ నుండి కానీ.. వారి కుటుంబం నుండి కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక స్పందన లేదు.