సౌత్‌ వాళ్లకు నడుమంటే ఇష్టమని అనలేదు : పూజా హెగ్డే క్లారిటీ

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 10:41 AM IST
సౌత్‌ వాళ్లకు నడుమంటే ఇష్టమని అనలేదు : పూజా హెగ్డే క్లారిటీ

Updated On : November 9, 2020 / 11:14 AM IST

Pooja Hegde About Her Comments : సోషల్ మీడియా దెబ్బకు పూజా హెగ్డే దిగొచ్చింది. నెటిజన్లు అపార్థం చేసుకున్నారని సంజాయిషీ ఇచ్చింది. తాను ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అక్షరాన్ని మార్చగలరేమో కానీ.. తన అభిమానాన్ని మార్చలేరని ఆమె స్పష్టం చేసింది.



తనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రాణ సమానమని, ఈ విషయం తన అభిమానులకు తెలిసినప్పటికీ.. ఎలాంటి అపార్థాలకు తావివ్వకూడదనే ఉద్దేశ్యంతోనే చెబుతున్నానన్నారు. తనకెంతో నచ్చిన తెలుగు ఇండస్ట్రీకి రుణపడి ఉంటానని ప్రకటించారు పూజాహెగ్డే.



https://10tv.in/six-constables-suspended-for-obscene-comments-on-woman-cop-up-pilibhit/
ఆమె కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ గురించి అనవసరమైన కామెంట్స్ చేశారు. సౌత్ ఆడియన్స్‌కి నడుము అంటే చాలా ఇష్టమని, మిడ్ డ్రెస్ ల్లోనే చూడాలనుకుంటారని, సినిమాల్లో కంపల్సరీగా హీరోయిన్ నడుము మీదే కాన్సన్ ట్రేట్ చేస్తారని సోషల్ మీడియా సాక్షిగా చెప్పింది. ఈ కామెంట్‌తో ఆమె విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దీంతో తన అభిమానులకు.. ఎలాంటి సందర్భంలో ఆ వ్యాఖ్యలు అనాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చేశారు.