Pooja Hegde: పూజా హెగ్దే బర్త్ డేని గ్రాండ్‌‌గా సెలెబ్రేట్ చేసిన సల్మాన్ అండ్ వెంకటేష్..

పూజా హెగ్దే హీరోయిన్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా "కిసీ కా భాయ్ కిసీ కీ జాన్". యాక్షన్-కామెడీగా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. పూజాకి అన్నయ్యగా వెంకీ మామ కనిపించబోతున్నాడట. అలాగే జగపతిబాబు కూడా ఈ మూవీలో మెరవనున్నాడు.

Pooja Hegde: పూజా హెగ్దే బర్త్ డేని గ్రాండ్‌‌గా సెలెబ్రేట్ చేసిన సల్మాన్ అండ్ వెంకటేష్..

Pooja Hegde Birthday Celebrations by Salman Khan And Victory Venkatesh

Updated On : October 13, 2022 / 2:53 PM IST

Pooja Hegde: పూజా హెగ్దే హీరోయిన్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా “కిసీ కా భాయ్ కిసీ కీ జాన్”. యాక్షన్-కామెడీగా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. పూజాకి అన్నయ్యగా వెంకీ మామ కనిపించబోతున్నాడట. అలాగే జగపతిబాబు కూడా ఈ మూవీలో మెరవనున్నాడు.

Pooja Hegde Stunning Pics: హాట్ ఫోటోలతో కాకరేపుతున్న పూజా హెగ్డే

ఈరోజు హీరోయిన్ పూజా పుట్టినరోజు కావడంతో.. మూవీ టీం సెట్ లో బర్త్ డే సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ అండ్ వెంకటేష్ తో పాటు జగపతిబాబు కూడా వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ‘సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్’ బ్యానర్ తమ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో పోస్ట్ చేసింది.

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా అతిధి పాత్రలో మెరబోతున్నాడట. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమా కోసం ఒక పాట అందిస్తున్నాడు. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30 న థియేటర్లలో సందడి చేయబోతుంది ఈ సినిమా.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan Films (@skfilmsofficial)