Pooja Hegde: జనగణమణ షూటింగ్ స్టార్ట్.. బుట్టబొమ్మతో మొదలుపెట్టన పూరీ
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీని మరోసారి దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు....

Pooja Hegde Joins Jana Gana Mana Shooting
Pooja Hegde: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీని మరోసారి దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ జాతీయ స్థాయిలో చేసి, సౌత్‌తో పాటు నార్త్ ఆడియెన్స్ చూపును కూడా తమవైపు తిప్పుకున్నారు. ‘జనగణమన’ అనే టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాను పూర్తిగా దేశభక్తి చిత్రంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Jana Gana Mana: ‘జనగణమన’కు ఇండియన్ డిఫెన్స్ ఝలక్..?
అయితే తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ముంబైలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. అయితే ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొనడం విశేషం. ఆమె ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ముంబైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, ప్రపంచంలోని పలు ఆసక్తికరమైన ప్రదేశాల్లో జరగబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. JGM అనే షార్ట్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అంటోంది.
Pooja Hegde : మరో ఐటెం సాంగ్‌కి ఓకే చెప్పనున్న పూజాహెగ్డే??
ఇక పూరీ డైరెక్షన్‌లో సినిమా చేయాలని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి JGMతో తన కల నేరవేరిందని సంతోషంతో ఉప్పొంగిపోతుంది అందాల భామ పూజా హెగ్డే. ఇక ఈ సినిమా షూటింగ్‌లో విజయ్ దేవరకొండ త్వరలోనే జాయిన్ అవుతాడని.. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఎలా ఉంటుందా అనేది చూడాలి.
JGM SHOOT BEGINS ?
Welcoming @hegdepooja on Board ✨@TheDeverakonda – #PuriJagannadh #JGM ??
WW Release on AUG 3rd 2023
@directorvamshi @PuriConnects #SrikaraStudios @IamVishuReddy pic.twitter.com/mPPxgfCqny
— Charmme Kaur (@Charmmeofficial) June 4, 2022