Pooja Hegde : మరో ఐటెం సాంగ్‌కి ఓకే చెప్పనున్న పూజాహెగ్డే??

ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరైన పూజాహెగ్డే సౌత్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఒక పక్కన హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క.........

Pooja Hegde : మరో ఐటెం సాంగ్‌కి ఓకే చెప్పనున్న పూజాహెగ్డే??

Pooja Hegde

Pooja Hegde :  ఇటీవల స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్స్ కి ఆలోచించకుండానే ఓకే చెప్పేస్తున్నారు. ఒక సినిమాకి వచ్చే రెమ్యునరేషన్ లో సగం పైగా ఒక ఐటెం సాంగ్ కోసం అయిదు రోజులు కష్టపడితే వచ్చేస్తుండటంతో స్టార్ హీరోయిన్స్ కి ఐటెం సాంగ్ ఆఫర్స్ వస్తే ఓకే చెప్తున్నారు. కాజల్, తమన్నా, పూజాహెగ్డే, సమంత, శృతి హాసన్.. ఇలా స్టార్ హీరోయిన్స్ అంతా ఐటెం సాంగ్స్ చేసిన వారే.

ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరైన పూజాహెగ్డే సౌత్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఒక పక్కన హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క ఐటెం సాంగ్స్ కి ఓకే చెప్తుంది. గతంలో రంగస్థలం సినిమాలో ఐటెం సాంగ్ చేసింది పూజా. ఇటీవల F3 సినిమాలో కూడా ఐటెం సాంగ్ కాకపోయినా స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా మరో సినిమాలో ఐటెం సాంగ్ కి ఓకే చెప్పనున్నట్టు తెలుస్తుంది.

F3 Movie : F3 సినిమా మూడు రోజుల కలెక్షన్స్..

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది. ఇందులో రష్మికని హీరోయిన్ అనుకుంటున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాలో ఉన్న ఒక ఐటెం సాంగ్ కి పూజాహెగ్డేని అడిగారట. బాలీవుడ్ లో ఐటెం సాంగ్ అంటే టాలీవుడ్ కంటే రెమ్యునరేషన్ ఎక్కువే వచ్చే ఛాన్స్ ఉంది. పూజా ఇంకా సమాధానం చెప్పకపోయినా ఓకే చెప్తుందనే అంటున్నారు ఆ చిత్ర యూనిట్. ప్రస్తుతం యానిమల్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం పూజాతో చర్చలు జరుపుతున్నారు. ఇది ఓకే ఐతే మరో ఐటెం సాంగ్ పూజా ఖాతాలో పడనుంది.