ఇద్దరు తప్ప ఇదే వైకుంఠపురం ఫ్యామిలీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న‘అల వైకుంఠపురములో’ షూటింగ్‌ లోకేషన్‌ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : November 25, 2019 / 08:37 AM IST
ఇద్దరు తప్ప ఇదే వైకుంఠపురం ఫ్యామిలీ

Updated On : November 25, 2019 / 8:37 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న‘అల వైకుంఠపురములో’ షూటింగ్‌ లోకేషన్‌ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. అల్లు అరవింద్, ఎస్.రాధకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘అల వైకుంఠపురములో’… ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి..

ఇటీవల విడుదల చేసిన ‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా ఈ సినిమా లొకేషన్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా హెగ్డే షూటింగ్‌ లోకేషన్‌లో మూవీ టీమ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘ఇది ఒక ఫ్యామిలీ మూవీ. ఇలాంటి గొప్ప నటులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కానీ సుశాంత్‌, నివేదా పేతురాజ్‌ ఈ ఫొటోలో మిస్‌ అయ్యార’ని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌పై సుశాంత్‌ స్పందించారు. ‘నేను కూడా మీ అందర్ని మిస్‌ అవుతున్నాను’ అని ట్వీట్‌ చేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘అల వైకుంఠపురములో’ విడుదల కానుంది.