Pooja Hegde Wants To Do That Type Of Movies
Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజా హెగ్డే, టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె బాలీవుడ్‌లో నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండంతో ఈ మూవీ సక్సెస్‌పై పూజా భారీ నమ్మకాలు పెట్టుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ పూజా చాలా సందడి చేసింది.
Pooja Hegde: పూజా హెగ్డేకు ఈవారం గట్టి పరీక్షే ఉందిగా.. నాలుగు సినిమాల తరువాత సక్సెస్ దక్కేనా..?
పలు ఇంటర్వ్యూల్లో పూజా చాలా ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పూజా తన మనసులోని మాటను బయటపెట్టింది. తన కెరీర్‌లో ఇప్పటివరకు చాలా కమర్షియల్ సినిమాల్లో నటించానని.. నటనకు స్కోప్ ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ పాత్రల్లోనూ నటించానని చెప్పుకొచ్చిన పూజా.. తనకు ఎప్పటికైనా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో పర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుందని.. అలాంటి పాత్రల్లో తనను తాను చూసుకోవాలని ఉందంటూ పూజా చెప్పుకొచ్చింది.
Pooja Hegde : నా సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు. నేను కాదు..
ఇక సల్మాన్ ఖాన్‌తో మూవీపై భారీ ఆశలు పెట్టుకున్న ఈ బ్యూటీ, టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB28 మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరి పూజా కోరికను ఎవరు తీరుస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.