Pooja Hegde: పూజా హెగ్డేకు ఈవారం గట్టి పరీక్షే ఉందిగా.. నాలుగు సినిమాల తరువాత సక్సెస్ దక్కేనా..?

Crucial Week For Pooja Hegde Ahead Of Kisi Ka Bhai Kisi Ki Jaan Release
Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో పూజా ఖచ్చితంగా హిట్ అందుకోవాలని చూస్తోంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందించింది.
Pooja Hegde : నా సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు. నేను కాదు..
ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో, ఈ వారం పూజాకు చాలా కీలకంగా మారింది. ఆమె గత చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్‌గా నిలవడంతో, ఈ సినిమా ఎలాగైనా హిట్ కావాలని ఆమె కోరుకుంటోంది. పూజా హీరోయిన్‌గా నటించిన ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాల్లో నటించిన పూజాకు నెగెటివ్ మార్కులు పడటంతో సల్మాన్ ఖాన్‌తో మూవీపైనే అమ్మడు ఆశలు పెట్టుకుంది.
Pooja Hegde: హాట్ అందాలను ఎరగా వేస్తూ మనసుల్ని దోచేస్తున్న పూజా హెగ్డే
ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తుండటంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది ఈ బ్యూటీ. మరి పూజాకు సల్మాన్ ఖాన్ ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.