Poonam Kaur: పూనమ్ కౌర్ కర్వా చౌత్.. ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు!

టాలీవుడ్‌లో ‘మాయాజాలం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, అటుపై కొన్ని సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది పూనమ్ కౌర్. ఆ తరువాత అమ్మడు సినిమాల్లో ఫేడవుట్ అవ్వడంతో ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. తాజాగా అమ్మడు కర్వా చౌత్ వేడుకలను జరుపుకున్నట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Poonam Kaur: పూనమ్ కౌర్ కర్వా చౌత్.. ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు!

Poonam Kaur Celebrates Karwa Chauth

Updated On : October 14, 2022 / 2:06 PM IST

Poonam Kaur: టాలీవుడ్‌లో ‘మాయాజాలం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, అటుపై కొన్ని సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది పూనమ్ కౌర్. ఆ తరువాత అమ్మడు సినిమాల్లో ఫేడవుట్ అవ్వడంతో ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తోంది. అయితే ఈ బ్యూటీ ఓ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా గతంలో వార్తలు గుప్పుమన్నాయి. కానీ, వాటన్నింటినీ ఆమె ఖండించింది.

Poonam Kaur : అబార్షన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు

ఇక పూనమ్ సోషల్ మీడియా వేదికగా ఏది పోస్ట్ చేసినా అది ఖచ్చితంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. సినీ, రాజకీయ వ్యవహారాలపై పూనమ్ తనదైన కౌంటర్స్ వేస్తూ వస్తోంది. తాజాగా అమ్మడు కర్వా చౌత్ వేడుకలను జరుపుకున్నట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి కాలేదని చెబుతున్న పూనమ్, ఇలా కర్వా చౌత్ పండగ జరుపుకోవడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Poonam Kaur: పూనమ్ కౌర్‌కు ఇద్దరు పిల్లలు.. నన్ను కాస్త బతకనివ్వండని ట్వీట్!

‘‘కర్వా చౌత్ వేడుకను పెళ్లయిన మహిళలు మాత్రమే జరుపుకుంటారు. అలాంటిది, నువ్వు ఈ పండుగ చేసుకోవడం ఏమిటి?’’ అంటూ పూనమ్‌ను అడుగుతున్నారు. చేతిలో జల్లెడ పట్టుకుని చంద్రుడి వైపు నవ్వుతూ చూస్తున్న పూనమ్ ఫోటోపై నెట్టింట పెద్ద చర్చ సాగుతోంది. మరి అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు పూనమ్ కౌర్ సమాధానమిస్తుందా లేదా అనేది చూడాలి.