Vijay Devarakonda : అమెరికాలో రాత్రిపూట.. పూరితో రౌడీ రచ్చ

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాద్ తో పాటు 'లైగర్' టీం మొన్న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కి వెళ్లారు. ఇవాళ్టి నుంచి అక్కడ షూటింగ్ మొదలవ్వనుంది. పూరి, విజయ్ రాత్రిపూట వీళ్లిద్దరు చిల్

Vijay Devarakonda : అమెరికాలో రాత్రిపూట.. పూరితో రౌడీ రచ్చ

Poori Vijay (1)

Updated On : November 14, 2021 / 8:32 AM IST

Vijay Devarakonda :  డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో ‘లైగర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతుంది. ఇప్పటికే సగం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. తాజాగా ‘లైగర్’ సినిమా మరో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది. ఈ షూటింగ్ అమెరికాలో జరగనుంది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాద్ తో పాటు ‘లైగర్’ టీం మొన్న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కి వెళ్లారు. ఇవాళ్టి నుంచి అక్కడ షూటింగ్ మొదలవ్వనుంది.

Pushpaka Vimanam : రౌడీ తమ్ముడికి షాక్.. పెట్టిన బడ్జెట్ కూడా వచ్చేలా లేదు

తాజాగా పూరి, విజయ్ కలిసి దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. అమెరికా లాస్ ఏంజిల్స్ లో రాత్రిపూట వీళ్లిద్దరు చిల్ అవుతున్నట్టు ఫోటోలు షేర్ చేశారు. పూరి, విజయ్ కలిసి రాత్రిపూట వెళ్లిన ప్లేసెస్ లో ఫొటోస్ తీసి వాటిని షేర్ చేసారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మామూలుగానే వీళ్లిద్దరు విడివిడిగా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటిది ఈ ఇద్దరూ కలిసారంటే రచ్చ మాములుగా ఉండదు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishwa : వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తా

ఈ సినిమాని 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయ్ కి ఇది తొలి పాన్ ఇండియా సినిమా. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేయబోతుండటం విశేషం. వచ్చే సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు పూరి జగన్నాధ్.