పవర్ స్టార్ డబుల్ ధమాకా -ఫ్యాన్స్‌ ఫుల్ దిల్ ఖుష్..

2020- రెండు సినిమాలతో పలకరించనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

  • Published By: sekhar ,Published On : March 7, 2020 / 03:43 PM IST
పవర్ స్టార్ డబుల్ ధమాకా -ఫ్యాన్స్‌ ఫుల్ దిల్ ఖుష్..

Updated On : March 7, 2020 / 3:43 PM IST

2020- రెండు సినిమాలతో పలకరించనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో మామూలు స్పీడు పెంచలేదు.. ఒకదాని తర్వాత ఒకటి వరసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఈ ఏడాది తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు పవన్.. 2017 సంక్రాంతికి రిలీజైన ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఏడాది తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

వేసవిలో తన 26వ సినిమాతో ‘వకీల్ సాబ్’గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మే 15న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఇదే సంవత్సరం మరో క్రేజీ ప్రాజెక్ట్‌తోనూ కిక్ ఇవ్వనున్నాడు పవర్ స్టార్. పవన్, క్రిష్ దర్శకత్వంలో నటించనున్న పిరియాడిక్ ఫిల్మ్.. ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తిచేసుకుని దీపావళి కానుకగా నవంబర్ 13న రిలీజ్ కానుందని సమాచారం. పవన్ ఒకే సంవత్సరంలో రెండేసి సినిమాలతో ఎంటర్‌టైన్ చేయడం ఇదే తొలిసారి కాదు.

ఇంతకుముందు 1998లో ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’.. 2006లో ‘బంగారం’, ‘అన్నవరం’,  2011లో ‘తీన్ మార్’, ‘పంజా’.. 2012లో ‘గబ్బర్ సింగ్’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలతోనూ సందడి చేశాడు. ఇప్పుడు ఐదోసారి కూడా డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు పవన్… 1998 నాటి మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.