బాలీవుడ్ లోకి బాహుబలి : ప్రభాస్ రాముడా ? శివుడా ?

ఆది పురుష్ లో ప్రభాస్ రోల్ ఎంటీ ? రాముడా ? శివుడా లేక ? ఇంకేంటి. అనే దానిపై చర్చించుకుంటున్నారు. ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌత్ తో కలిసి ప్రభాస్ చేయనున్న ఫిల్మ్ కు సంబంధించిన న్యూస్ వెలువడింది. ‘ఆది పురుష్’ టైటిల్ తో సినిమా నిర్మితమౌతోంది.
దీనికి సంబంధించిన పోస్టర్ ను 2020, ఆగస్టు 18వ తేదీ ఉదయం రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ప్రభాస్ తన ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా విడుదల చేశారు. క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.
కానీ..ప్రభాస్ రోల్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే..పౌరాణికం చిత్ర అనిపిస్తోంది. పోస్టర్ లో ప్రభాస్ పెద్ద జుట్టు, చేతిలో ఏదో పట్టుకున్నట్లు కనిపిస్తోంది. కింద హనుమంతుడు లేక జాంబవంతుడు, రెండు దేవాలయాలు, కుడి, ఎడమ వైపున రాక్షసులు అనిపించేలా వ్యక్తులున్నారు.
టైటిల్ (ఆది పురుషుడు) ను బట్టి ప్రభాస్..రాముడు లేదా శివుడి పాత్రలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. చెడుపై మంచి విజయాన్ని పండుగ చేసుకుందాం అని క్యాప్షన్ లో పెట్టారు. చిత్ర పోస్టర్ ను బట్టి చూస్తే..పక్కగా..పౌరాణిక చిత్రమని స్పష్టంగా అర్థమౌతోంది.
త్రీడీలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.
ఈ సినిమా మెయిన్ గా బాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తెరక్కుతుందని అంటున్నారు.
రామాయణ, మహా భారతాలకి సంబందించిన సబ్జెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. ఈ సినిమా కూడా బాహుబలి సినిమా తరహాలో..ఉంటుందని తెలుస్తోంది. పౌరాణిక చిత్రంతో..ప్రభాస్ కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలువనుంది.