Prabhas Adipurush Censor Board Certificate and final run time
Prabhas Adipurush : దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో రామాయణం కథాంశంతో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా కనిపిస్తూ చేసిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ మొదటి ట్రైలర్ మూవీ పై మంచి ఆసక్తి కలుగజేసింది. ఇక ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ సెకండ్ ట్రైలర్ ఆడియన్స్ లో ఆదిపురుష్ పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు.
జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ఫైనల్ రన్ టైంని లాక్ చేసుకుంది. అలాగే సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్ U సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా పూర్తి నిడివి వచ్చి 2 గంటల 59 నిముషాలు. దాదాపు 3 గంటల నిడివితో ఆదిపురుష్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి అందరికి తెలిసిన రామకథని సరికొత్తగా నేటి ఆడియన్స్ కి ఆదిపురుష్ టీం ఎలా చూపిస్తుందో చూడాలి.
Adipurush : ఓం రౌత్, కృతి ముద్దు వ్యవహారం.. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఆగ్రహం..
కాగా ఆదిపురుష్ తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 170 కోట్లకు కొనుగోలు చేసింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అన్ని ఏరియాల్లోను సినిమాకు బాగా బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం. ఇక నైజాం రైట్స్ ని స్టార్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు చాలా ఎక్కువుగా, ముందుగా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో మూవీ భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
Adipurush is officially #PrathiBhaaratheeyudidhi as the movie gets a clean “U-Certificate” from the Censor Board#AdipurushOnJune16#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi @UV_Creations #KrishanKumar @vfxwaala @rajeshnair06… pic.twitter.com/rtmJj4B2rN
— BA Raju’s Team (@baraju_SuperHit) June 8, 2023