Prabhas : కృష్ణం రాజు అలా అనేసరికి.. ప్రభాస్ ఏకంగా స్పెషల్ ఫ్లైట్ తెప్పించి ఏం చేసాడంటే..
ప్రభాస్ కి తన పెదనాన్న కృష్ణం రాజు అంటే ఎంత ఇష్టం, వీరిద్దరి మధ్య అనుబంధం ఎంత ఉండేదో అందరికి తెలిసిందే.(Prabhas)
Prabhas
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో సంక్రాంతికి రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రభాస్ కి తన పెదనాన్న కృష్ణం రాజు అంటే ఎంత ఇష్టం, వీరిద్దరి మధ్య అనుబంధం ఎంత ఉండేదో అందరికి తెలిసిందే.(Prabhas)
ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ మీడియాతో మాట్లాడుతున్నారు. పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణం రాజు భార్య శ్యామల దేవి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు.
Also See : Samantha : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి.. పెళ్లి చీరలో సమంత సోలో ఫొటోలు చూశారా?
శ్యామల దేవి మాట్లాడుతూ.. ఓ సారి కృష్ణం రాజు గారు బోర్ కొట్టేస్తుందని అన్నారు ప్రభాస్ తో. దాంతో బాబు(ప్రభాస్) స్పెషల్ ఫ్లైట్ తెప్పించి మా అందర్నీ మాల్దీవ్స్ కి పంపించారు. బోర్ కొడుతుంది కదా వెళ్లి ఎంజాయ్ చేసి రండి అన్నాడు ప్రభాస్ పెదనాన్నతో. బాబు రాలేదు కానీ కృష్ణం రాజు గారిని, నన్ను, ఫ్యామిలీ అందర్నీ పంపించాడు. నెలన్నర రోజులు అక్కడ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసి వచ్చాము. కృష్ణంరాజు గారు కూడా అక్కడ బాగా ఎంజాయ్ చేశారు అని తెలిపారు.
ప్రభాస్ భోళాతనం గురించి అందరికి తెలిసిందే. ఫుడ్ కడుపునిండా పెట్టడంలో, ఎవరికైనా సహాయం చేయడంలో ప్రభాస్ ముందుంటారు. కానీ కృష్ణం రాజు జస్ట్ బోర్ కొడుతుందని అడిగితే ఏకంగా స్పెషల్ ఫ్లైట్ తెప్పించి అందర్నీ మాల్దీవ్స్ పంపించడం ఏంట్రా బాబు అని ఆశ్చర్యపోతున్నారు అంతా.
Also Read : Dil Raju : ‘పవన్, దిల్ రాజు కాంబోలో సినిమా’పై SVC అధికారిక ప్రకటన
