Prabhas Sister : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. అన్నయ్యతో చిన్నప్పటి ఫోటోలు షేర్ చేసిన ప్రభాస్ చెల్లి..

నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో చాలా ఫోటోలు షేర్ చేసి అన్నయ్యకు విషెస్ చెప్పింది ప్రసీద.

Prabhas Birthday Special Prabhas Sister Praseedha Shares Childhood Photos goes Viral

Prabhas Sister : నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు అనేకమంది ప్రభాస్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ చెల్లి ప్రసీద ఉప్పలపాటి పలు స్పెషల్ ఫోటోలు, చిన్నప్పుడు అన్నయ్యతో దిగిన ఫోటోలు షేర్ చేసి ప్రభాస్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పింది.

Also Read : Prabhas : రికార్డుల్లో రారాజు.. దానంలో కర్ణుడు.. అభిమానులకు దేవుడు.. మంచితనానికి మారుపేరు.. ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్..

కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లు అని తెలిసిందే. ఈ ముగ్గురికి ప్రభాస్ అన్నయ్య అంటే చాలా ఇష్టం. ప్రభాస్ కూడా వాళ్ళను బాగా చూసుకుంటాడు. ఈ ముగ్గురులో ప్రసీద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను కూడా చూసుకుంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ తో ఉన్న ఫోటోలు ప్రసీద షేర్ చేస్తూ ఉంటుంది.

నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో చాలా ఫోటోలు షేర్ చేసి అన్నయ్యకు విషెస్ చెప్పింది. ప్రభాస్ తో రీసెంట్ గా దిగిన ఫొటోలతో పాటు చిన్నప్పటి ఫోటోలు కూడా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.